![]() |
![]() |

డ్రామా జూనియర్స్ లో రోజా- అనిల్ రావిపూడి - శ్రీకాంత్ - సుధీర్ కామెడీ హిలేరియస్ గా ఉంటోంది. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఇందులో సుధీర్ ని ఈ ముగ్గురితో పాటు విజిల్ రాణి కూడా ఫుల్ గా రోస్ట్ చేసేసారు. విజిల్ రాణి టీమ్ తో పాటు డీజే డ్రామా ట్యూషన్ కి సుధీర్ కూడా స్కూల్ బాయ్ లా బాగ్ వేసుకుని వచ్చాడు. "సమ్మర్ లో నువ్వు ఎం ఎం చేసావ్ " అని విజిల్ రాణి అడిగింది. "సమ్మర్ లో ఎండలు బాగా ఉన్నాయి అందుకే ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను బయటకు పంపలేదు " అని చెప్పాడు సుధీర్. "నిన్ను బయటకు పంపించకపోతేనే ఇలా ఉన్నావంటే ఇంకా పంపిస్తే ఎలా ఉండేవాడివో " అంటూ సుధీర్ ని రోస్ట్ చేసింది.
రోజా పడీ పడీ నవ్వేసింది. అనిల్ రావిపూడి ఐతే "ఎవరో నన్ను తమ్ముడు అంటే తెగ ఫీలైపోయాడు వాడు మాత్రం కిడ్ గా వచ్చాడు. నరికేయాలాడిని " అన్నాడు కామెడీగా. సుధీర్ నవ్వుకున్నాడు. జడ్జ్ శ్రీకాంత్ ట్యూషన్ మాష్టర్ లా బెత్తం పట్టుకుని వచ్చి "ఇక్కడ హిందీ ఎవరికీ బాగా వచ్చురా " అని అడిగాడు. "వీళ్లందరి కన్నా బాగా వచ్చు సర్ నాకు " అన్నాడు సుధీర్. "హిందీలో తమ్ముడిని ఏమంటార్రా " అని అడిగారు శ్రీకాంత్. "తుమ్ముడు" అన్నాడు సుధీర్. అంతే బెత్తంతో వాయించి పడేసారు. "నీకు తెలిసిన ఇద్దరు కవుల గురించి చెప్పు " అన్నారు. "మా తాత మా నాన్న " అన్నాడు. "వాళ్ళు కవులేంట్రా " అన్నారు శ్రీకాంత్. "మా తాత 20 ఎకరాలు కౌలుకు ఇచ్చాడు సర్. మా నాన్న 10 ఎకరాలు కౌలుకు ఇచ్చాడు సర్" అని చెప్పాడు. "భగవంత్ కేసరికి ఒక అవార్డు వచ్చింది అది ఏది " అని అడిగారు. "ప్రామిస్ చేసి చెప్తున్నా సర్. అది ఆయన దగ్గర ఉంది..నా దగ్గర లేదు" అని అనిల్ రావిపూడి మీదకు తోసేసాడు. "ఏ అవార్డు వచ్చిందని " అంటూ శ్రీకాంత్ బెత్తంతో సుధీర్ ని బాదేశారు.
"వాడికి తక్కువ మార్కులు వచ్చాయా నేను వాడిని ఫాదర్ ని సర్ " అంటూ అనిల్ రావిపూడి వచ్చారు. ఆయన కూడా సుధీర్ ని బెత్తంతో బాదేశారు. "చివరిగా నీకో టెస్టు.. అమ్మ పేరు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ రాయరా "అన్నారు. రాజా అని రాసాడు సుధీర్. "నా పేరు ఏంటి నాన్న" అంటూ రోజా అడిగారు. "ఇంటికి రోజా ఐనా రాజా ఐనా నువ్వే కాదమ్మా " అన్నాడు. ఇక రోజా కూడా బెత్తంతో సుధీర్ చేతి మీద ఒక్కటిచ్చింది. ఇలా ఫుల్ ఎంటర్టైన్ చేశారు జడ్జెస్.
![]() |
![]() |